తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 574 పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న 44 వేల మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 109 నమోదయ్యాయి.
వైరస్ ప్రభావంతో నిన్న మరో ముగ్గురు మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 1524కు పెరిగింది. ఇక రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,83,556 కి చేరింది. తాజాగా కరోనా నుంచి 384 మంది కోలుకోగా.. మొత్తం 2,75,217 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6815 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 66.11 లక్షల మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.