దాయాది దేశం పాకిస్తాన్ అదుపులో 577 మంది భారతీయ మత్స్యకారులు ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు పాకిస్తాన్ అందించిన సమాచారాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
జనవరి 1 2022న పాకిస్తాన్ అందించిన వివరాల ప్రకారం.. 577 మంది భారత మత్స్యకారులు పాక్ నిర్బంధంలో ఉన్నట్టు వెల్లడించారు కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి మురళీధరన్.
‘భారత ప్రభుత్వ నిరంతర ప్రయత్నాల ఫలితంగా, 2014 నుంచి 2,140 మంది మత్స్యకారులు, 7 పడవలను పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చాయి’ అని చెప్పారు. ‘గత ఐదేళ్లలో పాకిస్తాన్ జైళ్లలో 9 మంది భారతీయ మత్స్యకారులు చనిపోయారు.
Advertisements
2017లో ముగ్గురు కస్టడీలో మరణించగా, 2018లో ఇద్దరు, 2019లో ఒకరు, 2020లో ఎవరూ మరణించలేదని, 2021లో ఇద్దరు, ఈ ఏడాదిలో మార్చి 10 నాటికి ఒకరు చనిపోయారు’ అని పేర్కొన్నారు.