ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 25,284 మందికి శాంపిల్స్ పరీక్షించగా 5,879 మందికి పాజిటివ్ వచ్చింది. కొత్తగా నమోదు అయిన కేసుల్లో అనంతపురంలో 856, తూర్పు గోదావరిలో 823, కడపలో 776, కృష్ణాలో 650 కేసులు నమోదు అయ్యాయి.
మరోవైపు గడిచిన 24 గంటల్లో 11,384 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. అలాగే ఇదే సమయంలో 9 మంది మృతి చెందారు.
తాజా గణాంకాల ప్రకారం :
మొత్తం మరణాల సంఖ్య – 14,615
పాజిటివ్ కేసుల సంఖ్య – 22,76,370
డిశ్చార్జ్ కేసుల సంఖ్య – 21,51,238
యాక్టీవ్ కేసుల సంఖ్య – 1,10,517