తెలంగాణలో కరోనా తీవ్రత స్వల్పంగా పెరిగింది. రాష్ట్రంలో నిన్న 41,970 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 592 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడిన బాధితుల సంఖ్య 2,81,414కి చేరింది. అటు నిన్న కరోనాతో ముగ్గురు మరణించారు. దీంతో ఈ వైరస్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,513కి పెరిగింది.
కొత్త కేసుల స్థాయిలోనే రికవరీలు కూడా కొనసాగుతున్నాయి. కరోనాబారి నుంచి తాజాగా 643 మంది కోలుకున్నారు.దీంతో మొత్తం డిశ్చార్జిలు 2,73,013కి పెరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 6,888 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 64.43 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.