అంతర్జాతీయ మహిళాదినోత్సవ సంబరాలు అప్పుడే హైదరాబాద్ లో ప్రారంభమయ్యాయి. మార్చ్ 8 ను పురస్కరించుకొని తెలంగాణ పోలీస్ షీ- టీమ్స్, హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో 2 -కె, 5 -కె రన్ లు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి విచ్చేసి ప్రారంభించారు. ఇక ప్రత్యేక ఆహ్వానితులుగా డీజీపీ అంజనీ కుమార్, సిటీ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్, మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ షికా గోయల్ లు హాజరయ్యారు.
అయితే మహిళా భద్రతా, షీ-టీమ్ లపై చైతన్యం.. తదితర అంశాలపై అవగాహనను కల్పించడానికి 2 -కె , 5 -కె రన్ లను సిటీ పోలీసుల ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం నెక్లెస్ రోడ్ లో నిర్వహించడం జరిగింది. ఈ రన్ లకు నగరంలోని యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇక మహిళా పోలీసులు, పోలీసు అధికారులు కూడా పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో పాటు పలువురు సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.