నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. రాజధాని ఖట్మండులో ఆదివారం ఉదయం 7.58 గంటల సమయంలో భూమి కంపించింది. సీతామర్రి, ముజఫర్ పూర్, భగల్ పూర్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి.
దీంతో ప్రజలు భయాందోళనలతో బయటికి పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైందని నేషనల్ సెంటర్ సీస్మోలజీ తెలిపింది.
ఖట్మండుకు 170 కిలోమీటర్ల దూరంలో ధిటుంగ్ ప్రాంతం వద్ద భూకంప కేంద్రం నిక్షిప్తమైనట్టు పేర్కొంది. భూకంపం వల్ల జరిగిన నష్టంపై ఇప్పటి వరకు ఎలాంటి వివరాలూ తెలియరాలేదని అధికారులు చెప్పారు.
గత సోమవారం కూడా నేపాల్ లో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్ర రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది. ఖట్మండుకు తూర్పున సింధూపాల్ చౌక్ జిల్లాలో హెలంబు ప్రాంతం వద్ద భూకంపం కేంద్రం నిక్షిప్తమైనట్టు తెలిపింది.