హిందూ మహాసముద్రానికి సునామీ ముప్పు పొంచి వున్నట్టు ఇండియన్ ఓషియన్ సునామీ వార్నింగ్ మెటిగేషన్ సిస్టమ్ (ఐఓఎస్ డబ్ల్యూఎంఎస్) హెచ్చరించింది.
తూర్పు తైమూరులో శుక్రవారం భూకంపం సంభవించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం వల్ల హిందూ మహాసముద్రంలో సునామీ సంభవించే అవకాశం ఉన్నట్టు ఐఓఎస్ డబ్ల్యూ హెచ్చరికలు జారీ చేసింది.
తైమూరు ద్వీపం నుంచి 51.4 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్టు తెలిపింది. తూర్పు తైమూరు, ఇండోనేషియా, వాటి పరిసర ప్రాంతాలు ‘పసిఫిక్ రిమ్’ అనే ప్రాంతంలో ఉన్నాయి.
అందువల్ల ఈ ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తుంటాయి. 2004లో సుమత్రా తీరం వద్ద 9.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో సునామీ సంభవించి 22000 మంది మరణించారు.