తజకిస్తాన్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.8గా నమోదైనట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే సంస్థ(యూఎస్ జీఎస్) వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో భూకంపం వచ్చినట్టు సంస్థ పేర్కొంది.
భూమి లోపల 20.5 కిలీమీటర్ల లోతులో భూమి కంపించినట్టు తెలిపింది. ముర్గోబ్ కు 67 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం నిక్షిప్తమైనట్టు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు చైనాలోనూ భూకంపం సంభవించినట్టు చైనా మీడియా చెప్పింది.
తజకిస్తాన్ సరిహద్దు ప్రాంతానికి సమీపంలోని జింజింయాంగ్ ప్రావిన్స్ లోని ఉయ్ గార్ అటానమస్ రీజియన్‌లో భూమి కంపించినట్టు చైనా మీడియా వివరించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదైనట్టు కథనాలు ప్రసారం చేసింది.
భూకంప కేంద్రం అప్ఝనిస్తాన్- చైనా సరిహద్దుల్లోని తూర్పు ప్రాంతం గోర్నో- బదాక్షన్ వద్ద భూకంప కేంద్రం నిక్షిప్తమైనట్టు వివరించింది. ఈ ప్రాంతంలో మొదట స్వల్పంగా భూమి కంపించింది. ఆ తర్వాత మరో 20 నిమిషాల తర్వాత మరోసారి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టాలు జరగనట్టు తెలుస్తోంది.