అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా పుష్ప. ఇటీవల అలవైకుంఠపురంలో సినిమాతో హిట్ అందుకుని మంచి జోష్ మీద ఉన్నాడు అల్లుఅర్జున్. మరో వైపు రంగస్థలం లాంటి హిట్ తరువాత సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కూడా. శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. కాగా ఈ సినిమాకు సంబందించిన ఓ వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తుంది.
ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ చేశారు. పుష్పలో 6 నిమిషాల యాక్షన్ సీన్ కోసం 6 కోట్లు ఖర్చు పెట్టబోతోన్నారు. అంతేకాకుండా భారత సినీ శ్రామికులకు ఉపాధి కల్పించేందుకు 100 శాతం ఇండియాలోనే షూట్ చేయబోతోన్నారు” అని తెలిపాడు . మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.