ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కళింగ ఘాటి వద్ద ప్రయాణీకులతో వెళుతున్న బస్సు బోర్లా పడింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారని అధికారులు తెలిపారు. మరో 31 మంది తీవ్రగాయాల పాలైనట్టు అధికారులు వివరించారు. పోలీసుల వివరాల ప్రకారం…
పశ్చిమబెంగాల్ కు చెందిన 75 మంది పర్యాటకులు బస్సులో ఏపీలోని విశాఖపట్టణానికి వెళుతున్నారు. ఘాట్ రోడులో వెళుతున్న సమయంలో బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు.
దీంతో బస్సు లోయలోకి దూసుకు పోయింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 15 మందికి తీవ్రగాయాలు కాగా, మరో 16 మందికి స్వల్పగాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.