హైదరాబాద్ లోని సైదాబాద్ జువైనల్ హోం నుంచి పదిమంది పిల్లలు తప్పించుకునే ప్రయత్నం చేశారు. వారిలో నలుగురిని వెంటపడి పట్టుకున్నారు సిబ్బంది. మిగిలిన ఆరుగురు పరారయ్యారు.
తప్పించుకున్న వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఘటనపై పోలీసులకు సైదాబాద్ బాలుర గృహం ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది.