క్రిస్మస్ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. రద్దీ ప్రాంతాలను టార్గెట్ చేస్తూ ఆత్మాహుతి దాడులకు పాల్పడే.. దుండగులు మరోసారి దారుణానికి ఒడిగడ్డారు. సెంట్రల్ ఆఫ్రికా కాంగోలో క్రిస్మస్ వేడుకల్లో బాంబ్ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో 13మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు.
ఉత్తర కివు ప్రాంతంలో సిటీలోని ఓ బార్ లో క్రిస్మస్ వేడుకలు జరుగుతుండగా బాంబ్ బ్లాస్ట్ జరిగిది. తర్వాత కాల్పులు కూడా జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను, గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ దాడికి ఎవరు పాల్పడ్డారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ వ్యవహారంపై ప్రత్యేక టీం ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.