అమెరికాలోని మిసిసిపీలో తుపాకీ మోత మోగింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు కాల్చి చంపబడ్డారని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. టేట్ కౌంటీలోని అర్కబుట్లలో జరిగిన హత్యలను మిస్సిస్సిప్పి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ ప్రతినిధి బెయిలీ మార్టిన్ ధృవీకరించారు. అదే సమయంలో, మిస్సిస్సిప్పి గవర్నర్ టేట్ రీవ్స్ కార్యాలయం తనకు కాల్పుల గురించి సమాచారం అందిందని చెప్పారు.
దీనికి సంబంధించి ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో, అనుమానితుడు ఒంటరిగా వ్యవహరించాడని తెలుస్తుందని రీవ్స్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఈ ఘటన వెనుక గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.
టేట్ కౌంటీ పోలీసు చీఫ్ కూడా సంఘటనను ధృవీకరించారు, అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారుఈ సంఘటన తరువాత టేట్ కౌంటీ షెరీఫ్ అధికారి బ్రాడ్ లాన్స్ మాట్లాడుతూ.. కాల్పులు అన్నీ అర్కబుట్ల కమ్యూనిటీలో జరిగాయని,తాజాగా అర్కబుట్ల రోడ్‌లోని స్టోర్ లోపల కాల్పులు జరిగాయని, ఒక వ్యక్తి కాల్చి చంపబడ్డాడు. అర్కబుట్ల ఆనకట్ట రోడ్డులోని ఓ ఇంట్లో మహిళ కూడా మృతి చెందింది. ఈ ఘటనలో ఆమె భర్త గాయపడ్డాడు.
అర్కబుట్ల డ్యామ్ రోడ్డులో వాహనంలో నిందితుడిని గుర్తించిన టేట్ కౌంటీ ప్రతినిధులు అదుపులోకి తీసుకున్నారు.అయితే..నిందితుడి గుర్తింపు వెల్లడి కాలేదు. అరెస్టుల అనంతరం అధికారులు మరో నలుగురు మృతి చెందినట్లు గుర్తించారు.ఈ ఘటనపై మిస్సిస్సిప్పి గవర్నర్ టేట్ రీవ్స్ ట్వీట్ చేస్తూ.. ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనలో ఒక వ్యక్తి హస్తం మాత్రమే ఉందని, పోలీసులు పరిశీలిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. అయితే విచారణ అనంతరం పూర్తి సమాచారం అందిస్తామని చెప్పారు. మరో ట్వీట్‌లో.. రీవ్స్ మిస్సిస్సిప్పి బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (MBI)ని దర్యాప్తులో సహాయం చేయమని కోరినట్లు తెలిపారు.