జుట్టు బాగా పెరిగిందని , బార్బర్ షాపులు ఓపెన్ చేయగానే వెంటనే కటింగ్ చేయించుకోవాలి అనుకునే వారికి హెచ్చరిక .మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో 12 మందికి ఒకే టవల్ తో కటింగ్ , షేవింగ్ చేయడంతో 6 గురికి కరోనా పాజిటివ్ అని తేలింది .దీంతో ఆ బార్బర్ షాప్ తో పాటు , ఊరు మొత్తాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించి మూసేసారు .రాష్ట్రంలోని అత్యధిక జనాభా ఉన్న ఖర్గోన్ జిల్లాలోని బర్గవ్ అనే గ్రామం లో జరిగిందీ ఘటన.
ఇండోర్ నుండి వచ్చిన కరోనా పాజిటివ్ వ్యక్తి కటింగ్ చేయించుకోవడం, తరువాత వరుసగా ౧౨ మందికి ఒకే టవల్ తో 11 మందికి కటింగ్, షేవింగ్ చేయడంతో కరోనా వ్యాపించింది . దీంతో జిల్లా అధికారులు వెంటనే అందరిని క్వారంటైన్ ను తరలించారు.కానీ కటింగ్ చేసిన బార్బర్ కు మాత్రం కరోనా నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది . శానిటైజర్ వాడడం వల్లే అతనికి కరోనా వచ్చి ఉండకపోవచ్చని వైద్య అధికారులు చెబుతున్నారు .ఈ జిల్లాలో మొత్తం 60 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి .
ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివ రాజ్ సింగ్ చౌహాన్ మండిపడ్డారు.లాక్ డౌన్ అమల్లో ఉన్నా వివిధ జిల్లాల్లో బార్బర్ షాపులు తెరిచి ఉంచడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు . మధ్యప్రదేశ్ లో మొత్తం 2000 లకు పైగా కేసులు నమోదయ్యాయి. 100 మంది ప్రాణాలు కోల్పోయారు .