కొత్త వేరియంట్ తో కలిసి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలోని రాష్ట్రాలను ఈ మహమ్మారి కమ్మేస్తోంది. అయితే.. రెండు వేవ్స్ లోనూ బాగా ఇబ్బందులు పడ్డ నగరం ముంబై. ఇప్పుడు అక్కడ తగ్గినట్టే తగ్గి మళ్లీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. థర్డ్ వేవ్ వస్తుందేమోనని తెగ కంగారు పడుతున్నారు.
ముంబైలో గురువారం రాత్రి వరకు కొత్తగా 602 మందికి పాజిటివ్ అని తేలింది. వారిలో ఒకరు మరణించారు. అక్టోబరు 6 తర్వాత ఈ స్థాయిలో కేసులు పెరగడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు అధికారులు. తాజా వాటితో కలిపి ఇప్పటిదాకా నగరంలో నమోదైన కేసుల సంఖ్య 7,68,750కు పెరిగింది.