తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత స్వల్పంగా పెరగింది. గడిచిన గంటల్లో రాష్ట్రంలో 45,227 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 617 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక కరోనా ప్రభావంతో నిన్న మరో ముగ్గురు చనిపోయారు. మరోవైపు నిన్న తాజాగా 635 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు.
కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2 లక్షల 8 వేల 347కి చేరింది. ఇందులో 2 లక్షల 74 వేల 260 మంది కోలుకోగా.. 1,518 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,569 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 4,400 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో ఇప్పటి వరకు 65.20 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.