ఇటీవల విమాన సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ఘటనలు తరుచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. మద్యం సేవించి విమాన మహిళా స్టాఫ్ తో అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. గడిచిన మూడు నెలల్లో అనుచితంగా ప్రవర్తించిన 8 మంది విమాన ప్రయాణికులను ఇండియాలో అరెస్ట్ చేశారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి వార్తల్లోకెక్కింది.
స్వీడన్ కు చెందిన 63 ఏళ్ల క్లాస్ ఎరిక్ హరాల్డ్ జోనాస్ వెస్ ట్బర్గ్ అనే వ్యక్తి బ్యాంక్ నుంచి ఇండిగో ఫ్లైట్ లో వస్తున్నారు. మద్యం సేవించి ఇండిగో మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించారు. దీంతో అతన్ని ముంబైలో అదుపులోకి తీసుకున్నారు ఎయిర్ పోర్టు పోలీసులు.
ఇండిగో మహిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదులో.. వెస్ట్ బర్గ్ తాగి ఉన్నాడని, అతను సీఫుడ్ గురించి అడిగాడని, ఆయనకు చికెన్ మీల్స్ సర్వ్ చేసి, బిల్ కట్టేందుకు ఏటీఎం అడిగానని, అయితే కార్డును స్వైప్ చేసే సమయంలో అతను తన చేయి పట్టుకున్నట్లు చెప్పింది.
మీల్స్ సర్వ్ చేస్తున్న సమయంలో కూడా ప్రయాణికుడి ప్రవర్తన సరిగా లేదు. ఓ దశలో 24 ఏళ్ల ఆ మహిళ ఉద్యోగి ఫ్లయిట్ కెప్టెన్ కు విషయాన్ని చేరవేసింది. ఆ తర్వాత వెస్ట్ బెర్గ్ కు రెడ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా అతను అందరి ముందు హద్దులు దాటి తనతో దరుసుగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులో తెలిపింది మహిళా ఉద్యోగి.