ఒడిశాలో కరోనా కలకలం రేపింది. రాయగడ్ జిల్లాలోని రెండు రెసిడెన్షియల్ హాస్టల్స్ లో 64 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ర్యాండమ్ టెస్టులు నిర్వహించిన తర్వాత విద్యార్థులకు కరోనా పాజిటివ్ ఉన్నట్టు గుర్తించామని అధికారులు తెలిపారు. అయితే విద్యార్థుల్లో కరోనా లక్షణాలు కనిపించలేదని వెల్లడించారు.
దీంతో విద్యా్ర్థులను ఐసోలేషన్ లో ఉంచినట్టు వివరించారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.
‘ రెండు రెసిడెన్షియల్ హాస్టళ్లకు చెందిన 64 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. వారిని ఐసోలేషన్ లో ఉంచాము. ప్రస్తుతం వారి శాంపిల్స్ ను రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ల్యాబ్ కు పంపుతున్నాము. ఆ హాస్టల్స్ కు వైద్య బృందాలను పంపుతున్నాము’ అని జిల్లా కలెక్టర్ సరోజ్ కుమార్ మిశ్రా అన్నారు.