ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 667 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 60,329 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 667 మందికి నిర్ధారణ అయింది. మరోవైపు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,71,972కు చేరింది.
గడిచిన 24 గంటల్లో 914 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 8,59,029 మంది కొలుకున్నారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో 7,033 మంది కొవిడ్‌తో మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 5,910 యాక్టివ్ కేసులు ఉన్నాయి.