67 వయసులో అలుపు ఆయాసం లేకుండా నడవడమే కష్టం. అలాంటిది ఓ బామ్మ ఎలాంటి బెరుకూ లేకుండా రోప్ సైక్లింగ్‌లో అదరగొట్టింది. చీరకట్టుతో రోప్ సైక్లింగ్‌లో దూసుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కంటెంట్ క్రియేటర్ షై ను ఈ వీడియోను షేర్ చేయగా ఇప్పటివరకూ 2000 మందికిపైగా వీక్షించారు. ఈ వీడియోలో 67 ఏండ్ల మహిళ యల్లో శారీ ధరంచి రోప్‌పై సైకిల్ రైడింగ్ చేయడం కనిపిస్తుంది.
ఆమె విజయవంతంగా ఈ ఫీట్‌ను ముగించడం చూడవచ్చు. భూమిపై నుంచి ఎత్తులో ఆమె సైక్లింగ్ చేయడంతో హెల్మెట్ ఇతర భద్రతా ఎక్విప్‌మెంట్‌ను ధరించి ఇందులో పాల్గొన్నారు.
67 ఏండ్ల వయసులో ఆమె తన ఆకాంక్షను నెరవేర్చుకున్నారని పోస్ట్ కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు ఫిదా అయిన నెటిజన్లు బామ్మ ఉత్సాహం స్ఫూర్తిదాయకమని ప్రశంసలు గుప్పించారు.