వాళ్లిద్దరి వయసు 11 ఏళ్లు.. కానీ.. రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయ్యారు. అంత గొప్ప లాటరీ ఏం తగిలిందనేగా మీ డౌట్. అయితే స్టోరీ పూర్తిగా చదివేయాల్సిందే.
బీహార్ లోని కటిహార్ జిల్లాకు చెందిన ఆశిష్, చరణ్ అనే విద్యార్థులు ఆరో తరగతి చదువుతున్నారు. ప్రభుత్వం అక్కడి పిల్లల కోసం ఓ పథకాన్ని నడుపుతోంది. దానికి సంబంధించిన డబ్బులు అకౌంట్ లో పడుతూ ఉంటాయి. వీరికి బీహార్ గ్రామీణ బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఇచ్చే డబ్బులు వచ్చాయో లేదో చెక్ చేద్దామని తల్లిదండ్రులతో కలిసి ఓ ఇంటర్ నెట్ సెంటర్ కి వెళ్లారు చరణ్, విశ్వాస్. అంతే.. అకౌంట్స్ లో ఉన్న డబ్బులు చూసి షాక్ కు గురయ్యారు వారంతా.
చరణ్ ఖాతాలో రూ.905 కోట్ల 20 లక్షలు, ఆశిష్ అకౌంట్ లో రూ.6.2 కోట్లు ఉన్నట్లు కనిపించింది. ఈ విషయం ఊరిలో చాటింపు కావడంతో అందరూ ఇంటర్ నెట్, ఏటీఎం సెంటర్లకు పరుగులు పెట్టారు. కానీ.. వారికి నిరాశే ఎదురైంది. చరణ్, ఆశిష్ అకౌంట్స్ లోనే భారీగా డబ్బులు ఉన్నట్లు కనిపిస్తోంది. దీనిపై బ్యాంకు మేనేజర్ ను సంప్రదించగా.. సాంకేతిక లోపం అని చెప్పాడు. విద్యార్థుల అకౌంట్స్ లో డబ్బు కనిపిస్తుంది కానీ… అంత మొత్తం వారి ఖాతాలో లేదని తెలిపాడు.
గత మార్చిలో ఖగారియా జిల్లాకు చెందిన వ్యక్తి అకౌంట్ లో రూ.5.5 లక్షలు జమ అయ్యాయి. తప్పు తెలుసుకున్న అధికారులు.. ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని రంజిత్ దాస్‌కు నోటీసులు పంపారు. ప్రధాని మోడీ రూ.15 లక్షలు ఇస్తానన్న హామీ ప్రకారం.. అందులో మొదటి ఇన్ స్టాల్ మెంట్ గా డబ్బు వేశారని ఖర్చు చేసినట్లు చెప్పాడు. దీంతో షాక్ తిన్న అధికారులు పోలీసుల ద్వారా అతడ్ని అరెస్ట్ చేశారు. అయితే కటిహార్ విద్యార్థుల ఖాతాల్లో మాత్రం డబ్బులు ఉన్నట్లు చూపించినా.. అంత మొత్తంలో నగదు లేదని చెప్పారు అధికారులు. వెంటనే సమస్యను సాల్వ్ చేశారు. అయినా.. దీనిపై సమగ్ర విచారణ జరుగుతోంది.