అక్కినేని నాగేశ్వరావు… ఎన్టీఆర్ తర్వాత ఇండస్ట్రీలో స్టార్డమ్ తెచ్చుకున్న హీరో. ఆయన చూడని హిట్లు లేవు, ఇండస్ట్రీ రికార్డులు లేవు. ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా చేసే నటుడు అక్కినేని నాగేశ్వరరావు. తెలుగులో అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ అనుకున్న హీరోగా కూడా అక్కినేని నాగేశ్వరరావు కు ఓ రికార్డ్ ఉంది. ఇక నాగేశ్వరావు సువర్ణ సుందరి సినిమా కాంట్రవర్సీతో ఉన్నప్పటికీ మిగిలిన వాటిలో 7 చిత్రాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి.
మొదటిగా బాలరాజు… ఈ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకొని సూపర్ స్టార్ గా మారారు అక్కినేని నాగేశ్వరావు. 1948లో పది లక్షల రూపాయల గ్రాస్ వసూలు చేసి సెన్సేషన్ సృష్టించింది. 11 కేంద్రాలలో 100 రోజులు, రెండు కేంద్రాలలో 175 రోజులు ఆడింది.
రెండవ సినిమా కీలుగుర్రం… 1949 లో ఈ చిత్రం రిలీజ్ అయింది. బాలరాజు సినిమాను మించి ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూలు చేసింది. 12 కేంద్రాలలో 100 రోజులు ఆడిన ఈ చిత్రం అప్పట్లో 15 లక్షలు వసూలు చేసింది. తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా ఈ చిత్రం ను డబ్ చేశారు. తెలుగు సినిమాను తమిళ్ లో డబ్ చేయడం అదే మొదటిసారి.
ALSO READ : టాలీవుడ్ లో 100 కి పైగా సినిమాలు చేసిన ఆ 14 మంది హీరోలు ఎవరో తెలుసా ?
ఇక మూడవ చిత్రం… దేవదాసు, ఈ చిత్రం ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచింది. ఇండియాలో ఒక మంచి నటుడిగా నాగేశ్వర్రావు కు దేవదాసు చిత్రం మంచి గుర్తింపు తీసుకొచ్చింది. 1953 లో రిలీజైన ఈ చిత్రం 13 కేంద్రాలలో వంద రోజులు ఆడి 30 లక్షల గ్రాస్ వసూలు చేసింది.
ALSO READ : అఖండ ను రిజెక్ట్ చేసిన నలుగురు హీరోయిన్స్ వీరే !
నాలుగో చిత్రం రోజులు మారాయి… పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా 1955 లో రిలీజ్ అయింది. ఈ చిత్రం 20 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. మూడు కేంద్రాలలో 175 రోజులు ఆడింది. అంతేకాకుండా 40 లక్షల రూపాయల గ్రాస్ ను కూడా వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇక 5వ చిత్రం మాయాబజార్… ఈ చిత్రం అప్పట్లో ఒక సెన్సేషన్. 50 లక్షల గ్రాస్ వసూలు చేసిన మొట్టమొదటి తెలుగు సినిమా మాయాబజార్. 15 కేంద్రాలలో వంద రోజులు ఆడిన చిత్రం ఇది.
ఇక ఆరో చిత్రం దసరా బుల్లోడు.. ఈ సినిమా కూడా ఏఎన్ ఆర్ స్టామినాను మరోసారి బాక్సాఫీస్ కు రుచి చూపించింది. కోటిన్నర గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం అప్పట్లో రిలీజైన లవకుశ మూవీ రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. ఈ చిత్రం 1971లో రిలీజ్ అయింది.
ఏడవ చిత్రం ప్రేమాభిషేకం… ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. 29 కేంద్రాలలో 100 రోజులు ఆడిన ఈ చిత్రం నాలుగున్నర కోట్ల గ్రాస్ వసూలు చేసి సౌత్ ఇండియా లోనే నెంబర్ వన్ మూవీ గా నిలిచింది.
Advertisements