చైనాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బావ్ టోవ్ సిటీలో కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు.
సోమవారం ఉదయం 2గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. సమాచారం అందగానే అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ప్రమాదంలో చిక్కుకున్న ఏడుగురిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయిందని అధికారులు చెబుతున్నారు.
ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు.