యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బహెరెయిచ్‌లోని మోతీ పూర్ ప్రాతంలో ప్రయాణీకులతో వెలుతున్న టెంపో వాహనం ఒకటి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. పోలీసుల వివరాల ప్రకారం….
కర్ణాటకకు చెందిన భక్తులు బెంగళూరు నుంచి అయోధ్యకు టెంపో వాహనంలో వెళుతున్నారు. లకీంపూర్-బహెరెయిచ్ జాతీయ రహదారిపై వెళుతుండగా మోతీపూర్ ఏరియాలో ట్రక్కును ఢీ కొట్టింది.
దీంతో టెంపోలోని ఆరుగురు ప్రయాణీకులు అక్కడికక్కడే మరణించారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు.