కాబూల్ ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక.. జనం విమానాశ్రయాలకు పరుగులు పెట్టారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇంకా ఫార్వార్డ్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అదేరోజు జరిగిన ఓ సంఘటన అందర్నీ కలిచివేస్తోంది.
కాబూల్ విమానాశ్రయంలో 7 నెలల చిన్నారి ప్లాస్టిక్ ట్రేలో ఒంటరిగా కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు మీడియాలో వైలర్ అవుతున్నాయి. ఆ చిన్నారిని పేరెంట్స్ దగ్గరకు చేర్చే ప్రయత్నం జరుగుతోంది.