ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కు చేరుకొని చరిత్ర సృష్టించింది ఏడేళ్ల బాలిక. బేస్ క్యాంప్ ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం ఆమె లెక్క చేయలేదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఇబ్బందులు పడినా.. తన ప్రయాణాన్ని కొనసాగించి అనుకున్న లక్ష్యాన్ని అవలీలగా సాధించేసింది.
పంజాబ్ లోని రోపర్ కు చెందిన సాన్వీ సూద్ అనే ఓ ఏడేళ్ల బాలిక.. కేవలం తొమ్మిది రోజుల్లోనే బేస్ క్యాంపు వద్దకు చేరుకుంది. ఆ ప్రాంతానికి చేరుకున్న అతి పిన్న వయస్కురాలిగా రికార్డ్ నెలకొల్పింది. దాదాపు 65 కిలో మీటర్ల ట్రాక్ లో ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ, వాటిని అధిగమించి బేస్ క్యాంప్ వద్దకు వెళ్లింది. అనంతరం అక్కడ భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసింది.
సాన్వీ మొహలీలోని స్కూల్ లో రెండో తరగతి చదువుతోంది. ఎవరెస్ట్ పై 5364 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ క్యాంపులో ఒక్కరోజైనా ఉండాలని బలంగా నిశ్చయించుకుంది. అందుకు తగ్గట్లుగానే ముందుగా అన్ని ఏర్పాట్లను చేసుకుంది.
Advertisements
కేవలం తొమ్మిది రోజుల్లో అక్కడికి చేరుకుని అందరి చేత శభాష్ అనిపించుకుంటుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ పట్టువిడవక తన లక్ష్యాన్ని చేరుకున్న సాన్వీని అందరూ అభినందిస్తున్నారు.