రసగుల్లా..చూస్తునే నోట్లో నీరూరుతోంది. ఉత్తరాదిన అసలు రసగుల్లా లేకుండా ఎలాంటి శుభకార్యం జరగదు. అయితే అలాంటి రసగుల్లా తిన్నవారు కొందరు ఆసుపత్రి పాలు కావాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే..ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ లోని మధర్పూర్ గ్రామంలో బుధవారం ఓ పెళ్లి వేడుక జరిగింది.
ఆ వేడుకలో జరిగిన విందులో రసగుల్ల తిన్న బంధువుల్లో చాలా మందికి ఫుడ్ పాయిజన్ అవ్వడంతో ఆసుపత్రి పాలయ్యారు. దాదాపు 70 మందికి ఫుడ్ పాయిజన్ అయినట్లు స్థానికులు తెలిపారు. ఆ స్వీట్ తిన్న వారిలో చాలా మందికి వాంతులు, విరేచనాలు అయ్యాయని వారందరిని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
వారిలో కొంత మంది ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నట్లు జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శక్తి బసు మాట్లాడుతూ.. జిల్లా ఆసుపత్రిలో రోగులందరి పరిస్థితి నిలకడగా ఉందని, కొందరిని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించినట్లు వివరించారు.