ఏపీలో లో కరోనా కేసుల సంఖ్య ప్రతిరోజు మూడంకెల సంఖ్యలోనే నమోదవుతోంది. తాజాగా గడచిన 24 గంటల్లో 56,988 నమూనాలను పరీక్షించగా 663 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు గడచిన 24 గంటల్లో ఏడుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 7003 కి చేరుకుంది.
ఇక మరోవైపు రాష్ట్రంలో మొత్తం కరుణ కేసుల సంఖ్య 8,69,412 కి చేరుకుంది. ఒక్క రోజులోనే 1159 మంది కరోనా నుంచి కోలుకోగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6924 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 10,16,6696 నమూనాలను పరీక్షించినట్టు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
Advertisements