తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరంలో మరోసారి భారీగా హవాలా సొమ్ము పట్టుబడింది. దీనికి సంబంధించి పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.79 లక్షల హవాలా సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇమ్రాన్ మాలిక్, సల్మాన్ మాలిక్.. హైదరాబాద్ వాసులు వెంకట్‌రెడ్డి, శేఖర్ రెండు వేర్వేరు కార్లలో రూ.79 లక్షలు తరలిస్తుండగా.. చాంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు.
నగదుకు సంబంధించి వారి వద్ద ఎలాంటి ఆధారాలు, రసీదులు లేకపోవడంతో హవాలా మార్గం ద్వారా తరలిస్తున్న సొమ్ముగా పోలీసులు గుర్తించారు.
అయితే భారీగా తరలిస్తున్న నగదు ఎవరి ఆదేశాలతో తీసుకువెళ్తున్నారు, ఎవరికి అందజేయడానికి అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.