ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 7974 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే మరోవైపు ఇదే సమయంలో 7,948 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే 343 మంది కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందారు. ఇక ప్రస్తుతం దేశంలో 87,245 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
ఇక ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,41,54,879కు పెరిగింది. అలాగే వైరస్ కారణంగా ఇప్పటివరకు మొత్తం 4,76,478 మంది మృతి చెందారు. మరోవైపు దేశంలో మొత్తం ఇప్పటివరకు 1,35,25,36,986 మంది కరోనా వాక్సిన్ వేసుకున్నారు.