యూపీలో రాజ్యసభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు వేశారు. మొత్తం ఎనిమిది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
నామినేషన్లు వేసిన వారిలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే. లక్ష్మణ్, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీకాంత్ వాజ్ పాయ్, మిథిలేశ్ కుమార్, రాధా మోహన్ దాస్, సురేంద్ర సింగ్ నాగర్, బాబూ రామ్ నిషద్, దర్శన సింగ్, సంగీత యాదవ్ ఉన్నారు.
నేటితో యూపీలో రాజ్యసభ స్థానాలకు నామినేషన్ల పర్వం ముగియనున్నది. రాజస్థాన్ లో బీజేపీ తరఫున డాక్టర్ సుభాష్ చంద్ర మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు.
నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 3న ఆఖరి తేదీ కాగా జూన్ 10న ఎన్నికలను నిర్వహించనున్నారు. అదే తేదీన ఓట్ల లెక్కింపును కూడా చేపట్టనున్నట్టు నోటిఫికేషన్ లో ఎన్నికల సంఘం పేర్కొంది.