ఆంధ్రప్రదేశ్‌లో రాత్రిపూట కర్ఫ్యూ ఎత్తివేయడంతో, చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. గత వారం రవితేజ ఖిలాడి, సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి.
అయితే ఈ వారం పెద్ద సినిమాలు ఏవి లేవు. కానీ మొత్తం ఎనిమిది సినిమాలు థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అందులో ముఖ్యమైన చిత్రం మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా.
డైమండ్ రత్న బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదట OTT ప్లాట్‌ఫారమ్‌ల కోసం అనుకున్నారు. ఇది 80 నిమిషాల చిన్న రన్‌టైమ్‌ను కలిగి ఉంది. కానీ శుక్రవారం థియేట్రికల్ రిలీజ్‌కి అంతా సిద్ధమైంది.
అలాగే వర్జిన్ స్టోరీ, బడవ రాస్కల్, విశ్వక్, గోల్‌మాల్ 2020, సురభి 70ఎమ్ఎమ్, బ్యాచ్, నీకు నాకు పెళ్లంట వంటి ఇతర సినిమాలు కూడా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
మరి ఈ సినిమాల్లో ఏ చిత్రం విజయం సాధిస్తుందో చూడాలి. వీటిలో ఏదోఒకటి క్లిక్ కాకపోతే గత వారం క్లాష్ విజేతగా నిలిచిన డీజే టిల్లు రానున్న కొద్ది రోజులు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది.