సినిమా టికెట్ల కోసం ఎనిమిదవ తరగతి కుర్రాడు బలవన్మరణానికి పాల్పడ్డ విషాదమిది.జగిత్యాలలోని పురానీపేటలో 8వ తరగతి చదువుతున్నాడు పాండులోజి నవదీప్. వయసు 11 ఏళ్ళు. నవదీప్ పవన్ కల్యాణ్ వీరాభిమాని.
అయితే ఈనెల 25న విడుదల కాబోతున్న బీమ్లా నాయక్ సినిమాకు ముందుగానే టికెట్ బుక్ చేసుకుందామనుకున్న నవదీప్ రూ.300 కావాలని తండ్రి నర్సయ్యను అడిగాడు. రోజు వారి కూలీ కి వెళ్లి బతికే బతుకులు వీరివి. కాగా కొడుకు 300 రూపాయలు ఒక్కసారిగా అడగడంతో కొద్దిగా సమయం కావాలని చెప్పాడట తండ్రి.
దీంతో మనస్తాపం చెందిన నవదీప్ మీరు ఎప్పుడూ ఇంతే అంటూ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడట. ఎంతసేపటికి తలుపులు తీయకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి వెళ్లిన తండ్రికి కుమారుడి మృతదేహం కనిపించింది.
లుంగీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.300 రూపాయల కోసం ఇంత పని చేస్తాడని అనుకోలేదు అంటూ రోదిస్తున్నారు.