ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా అల్లుఅర్జున్ నటిస్తున్నారు. ఇక ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదల అయిన లుక్స్, టీజర్ ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఫస్ట్ సింగిల్ అయితే యూట్యూబ్ లో అసలు ఆగటం లేదు. వ్యూస్ పరంగా కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుంది. అన్ని బాషల్లో కలిపి 80 మిలియన్ లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇక ఇందులో మళయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండగా… దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ లో ఈ సినిమా విడుదల కానుంది.