చాలా మంది నలభై యేళ్ళకే అంతా అయిపోయినట్టు తీర్మానించుకుంటారు. సర్వ సాధారణంగా వచ్చే తుమ్ములు, దగ్గులకే శరీరానికి రానికి వృద్ధాన్ని అంటగడతుంటారు. యూ ట్యూబ్ లో చర్చించే అడ్డమైన రోగాలను తమకు అన్వయించకుని, అతిగా ఊహించుకుని ఫార్మసీ వైపు పరుగులు తీస్తుంటారు.
సహజంగా వృద్ధాప్యాన్ని అనుభవిస్తున్న వారి సంగతి సరేసరి. కానీ 80 యేళ్ళ ముదిమి వయసులో ఓ బామ్మ పారాగ్లైడింగ్ చేసి అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేసింది. ఈ ఓల్డేజ్ ఏజ్ బామ్మ టీనేజ్ అమ్మాయిలా విన్యాసాలు వైరల్ అవుతున్నాయి. ఆమె పట్టుదలకు,సాహసానికి సాహో అంటున్నారు. ఈ వైరల్ వీడియోను సెలినామోసెస్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా..లక్షలాది మంది వీక్షించి పలు కామెంట్లు చేస్తున్నారు.
దాదాపు 4 మిలియన్లకు పైగా లైక్‌లు వచ్చాయంటే ఈ వీడియో ఎంత వైరల్ అవుతుందో చెప్పక్కర్లేదు. వీడియో క్లిప్ పాతదే అయినప్పటికీ తాజాగా వైరల్ అవుతోంది. అయితే.. విషాదకర సంఘటన ఏమిటంటే పట్టరాని సంతోషంతో, సాధించిన సాహసంతో ఆమె పారాగ్లైడింగ్ చేస్తూనే ప్రాణాలు విడిచింది.