నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నుమాయిష్-2022ను తెలంగాణ గవర్నర్ తమిళిసై, హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సందర్శకులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని గవర్నర్ సూచించారు. ఎగ్జిబిషన్ జరిగినన్ని రోజులు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వాహకుల పర్యవేక్షణలో ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని చెప్పారు తమిళిసై.
ఎగ్జిబిషన్ ఎంట్రీ ఫీజు రూ.30గా నిర్ణయించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 15వందల స్టాళ్లకు అనుమతినిచ్చారు. 46 రోజుల పాటు కొనసాగే ఈ ఎగ్జిబిషన్ లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహం 3గంటల వరకు సందర్శకులను వాహనాలతో అనుమతిస్తారు. కారుకు రూ.600, ఆటోకు రూ.300, ద్విచక్రవాహనానికి రూ.100 రుసుముగా నిర్ణయించారు.