ఉత్తరప్రదేశ్ లోని ఖైసర్ బాగ్ ప్రాంతంలో 82 ఏళ్ల వృద్ధురాలిని ఆమె ఇంట్లో పెంచుకునే కుక్కే దాడి చేసి చంపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
సుశీలా త్రిపాఠి అనే రిటైర్డ్ స్కూల్ టీచర్ తన ఇంటి పైన ఉండగా ఆమె పెంపుడు జంతువు పిట్ బుల్ ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. రక్తపుమడుగులో ఉన్న ఆమెను ఇంటి పనిమనిషి గుర్తించి ఆమె కుమారుడికి తెలిపింది. వృద్ధురాలిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె చనిపోయినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపినట్లు తెలిపారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చనిపోయిన వృద్ధురాలు తన నివాసంలో చిన్న కొడుకుతో కలిసి నివసిస్తున్నారు. వారికి రెండు పెంపుడు కుక్కులు ఉన్నాయి. ఇందులో ఒకటి పిట్ బుల్ కుక్క.
కైసర్‌బాగ్‌లోని అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్, యోగేష్ కుమార్ మాట్లాడుతూ, “బెంగాలీ తోలా ప్రాంతానికి చెందిన సుశీలా త్రిపాఠి, పెంపుడు కుక్క అయినటువంటి పిట్ బుల్ కుక్క ఆమె పై దాడి చేయడంతో ఆమె మరణించారు. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించాంష. అని వివరించారు.
మునిసిపల్ కార్పొరేషన్ బృందం కుక్కను స్వాధీనం చేసుకోవడానికి త్రిపాఠి నివాసానికి చేరుకుంది, దీని గురించి వెటర్నరీ అధికారి డాక్టర్ అభినవ్ వర్మ మాట్లాడుతూ, “పిట్ బుల్ కుక్కను పెంపుడు జంతువుగా పెంచుకోవడానికి కుటుంబానికి లైసెన్స్ ఉందా లేదా అని తనిఖీ చేయడానికి మా బృందం ఇంటికి వెళ్ళింది. కానీ ఇంటికి తాళం వేసి ఉన్నందున అందుకే మాకు ఏ వివరాలు పూర్తిగా తెలియలేదుష అని తెలిపారు.
కుక్క ఆచూకీ గురించి తమకు సమాచారం లేదని, దాని గురించి కొడుకును అడిగేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. పిట్ బుల్ మీడియం-సైజ్, పొట్టి జుట్టు కుక్క, దీనిని శిక్షణ లేని వ్యక్తులు ఇంటి పెంపుడు జంతువుగా ఉంచడం వల్ల అది చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంది అని అధికారులు తెలిపారు.