భారతదేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,306 కరోనా కేసులు నమోదయ్యాయి.ఇది నిన్నటితో పోలిస్తే 6.6% తగ్గింది. ఇక తాజా గణాంకాల ప్రకారం మొత్తం కేసుల సంఖ్య 3,46,41,561కి చేరుకుంది. అత్యధికంగా కేరళ 4,450, తమిళనాడులో 724, మహారాష్ట్ర 707, పశ్చిమ బెంగాల్‌లో 620, కర్ణాటకలో 456 కేసులు నమోదు అయ్యాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో 83.76 శాతం కొత్త కేసులు నమోదయ్యాయి.
మరోవైపు గడిచిన 24 గంటల్లో 211మంది ఈ మహమ్మారి కారణంగా మృతి చెందారు.దీనితో మొత్తం మరణాల సంఖ్య 4,73537కి చేరుకుంది. కేరళలో అత్యధికంగా 161మరణాలు, తమిళనాడులో 10 మరణాలు నమోదయ్యాయి.