తెలంగాణలో మరో 5 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో, రాష్ట్రంలో మొత్తం ఈ మహమ్మారి బాధితుల సంఖ్య 84కి చేరింది. ప్రతీ రోజు పెరుగుతున్న కేసులతో రాష్ట్రంలో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆస్పత్రిలో అన్ని సదుపాయాలు ఏర్పటు చేసుకోవాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించింది. మెడిసిన్, బెడ్లు సిద్దం చేస్తుంది. మరో వైపు 32 మంది బాధితులు ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు. ఈరోజు రాష్ట్రవ్యాప్తం 274 కరోనా కేసులు బయటపడ్డాయి. ఒకరు కరోనాతో మృతి చెందారు. మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నంత ఒమిక్రాన్ ప్రభావం రాష్ట్రంలో లేకపోయినా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. మాస్కులు, భౌతికదూరం పాటించాలని తెలిపింది.
Tolivelugu Latest Telugu Breaking News » Hyderabad » 84కి చేరిన ఒమిక్రాన్ కేసులు