హుజూర్‌నగర్ : తన 100 ఎకరాల భూమికి అధికారులు పట్టా పుస్తకం ఇవ్వలేదని నిరసిస్తూ హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు ఓ 85 ఏళ్ల వృద్ధురాలు నామినేషన్ వేసింది. హుజూర్‌నగర్‌కు చెందిన లక్ష్మీ నర్సమ్మ గత కొంతకాలంగా తన భూమికి పట్టాలు ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతోంది. అయినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో దానికి నిరసనగా.. ఇలా నామినేషన్ వేసింది. ఆమెతో పాటు తమ భూములకు పట్టాలు ఇవ్వడం లేదని మట్టంపల్లి మండలం గుర్రంపోడు గిరిజనులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు.