దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టు కు లేఖ రాశాయి మహిళా సంఘాలు.కస్టడీలో ఉన్న నిందితులను ఎన్కౌంటర్ ఎలా చేస్తారని లేక లో పేర్కొన్నారు.కోర్ట్ లో కేసు నడుస్తున్న నేపథ్యంలో ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఎలా ఎన్ కౌంటర్ చేస్తారని లేఖలో రాసుకొచ్చారు.ఎన్ కౌంటర్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిజీపీ కి దేశాలు ఇవ్వాలని,నలుగురు మృత దేహాలకు ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టం చేసి వీడియో తీయాలని లేఖ లో పేర్కొన్నారు.హైకోర్టు చీఫ్ జస్టిస్ అందుబాటులో లేకపోవడంతో లేక ను సోమవారం విచారిస్తామని, 9 వ తేదీ వరకు మృతదేహాలను భద్రపరచాలంటూ ఆదేశాలు జారీ చేసింది కోర్ట్.