ప్రపంచం అంతా కరోనా వైరస్ కోసం ఆ మందు పనిచేస్తుంది, ఇది మేం తయారు చేశాం అంటూ ఆయా దేశాలు ప్రకటిస్తున్నాయి. అయితే… ఇప్పటి వరకు డెవలప్ అయిన మందులతో ప్రపంచ వ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించి, ఆసుపత్రులను ఎంపిక చేసింది.
భారత్ నుండి 9 ఆసుపత్రుల్లో క్లినికల్ ట్రయల్స్ జరగబోతున్నాయి. రెమ్‌డెసివిర్, లోపెనావిర్, రిటోనావిర్, హైడ్రాక్సీ క్లోరోక్విన్, ఇంటర్ఫెరాన్ బీటా-లా లోపినావీర్, రిటోనావీర్ మందులతో ఈ క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి చేస్తారు కాబట్టి వాటి పనితీరు ఎలా ఉందో తెలుసుకునే వీలు కలుగుతుంది. ఇందుకోసం జోధ్‌పుర్‌లోని ఎయిమ్స్, చెన్నైలోని అపోలో ఆసుపత్రి, అహ్మదాబాద్‌కు చెందిన బీజే మెడికల్ కళాశాల, పౌర ఆసుపత్రి, భోపాల్‌లోని చిరాయు మెడికల్ కళాశాలను ఎంపిక చేశారు.
దేశంలో 20 నుండి 30 ఔషధ నియంత్రణ కేంద్రాల ద్వారా ఇవి జరగబోతున్నాయని, ఇప్పటికే ఎంపిక పూర్తయిందని… ప్రపంచ వ్యాప్తంగా 1500 నమునాలు సేకరించబోతున్నట్లు సాలిడాటరీ ట్రయల్స్ సమన్వయ కర్త డాక్టర్ షీలా అన్నారు.