పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. రెంటచింతలలోని విద్యుత్ కార్యాలయం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
శ్రీశైలం నుంచి రెంట చింతలకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఈ ఘటనలో 9 మంది మరణించారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు గురజాల ఆస్పత్రికి తరలించారు.
వారిలో ఒకరి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.