పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు అనగానే ఆయన ఫాన్స్ లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన చేయాలి అనుకునే సినిమాలకు సంబంధించి ఫాన్స్ లో ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇక ఆయన వదులుకున్న వాటి గురించి కూడా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా ఆయన వదిలేసిన, మొదలుపెట్టకుండా ఆగిపోయిన సినిమాలు ఒకసారి చూస్తే…
సత్యాగ్రహి
ఈ సినిమా పవన్ కళ్యాణ్ కు ఒకరకంగా డ్రీం ప్రాజెక్ట్ అనే చెప్పాలి. దీనికి సంబంధించి పోస్టర్స్ గాని… సినిమా ప్రకటన గాని అప్పట్లో ఒక సంచలనం అనే చెప్పాలి. లోకనాయక్ జయప్రకాష్ నారాయణ ను స్పూర్తిగా తీసుకున్నారు. 2003 లో ఈ సినిమా రావాల్సి ఉంది. కాని ఆ సినిమా ఆగిపోయింది.
చెప్పాలని ఉంది
ఈ సినిమానే నువ్వే కావాలి పేరుతో తరుణ్ హీరోగా తీసుకొచ్చారు. ఈ కథతో అమీషా పటేల్ హీరోయిన్ గా పెట్టి తీద్దాం అని ప్లాన్ చేసారు.
ప్రిన్స్ ఆఫ్ పీస్
ఈ సినిమాను పూర్తిగా జీసస్ క్రీస్తు గురించి తెరకేక్కించాలి అని భావించారు. సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ జీసస్ గా నటించాల్సి ఉంది. ఈ సినిమా బడ్జెట్ అప్పట్లో ఒక సంచలనం. ఇజ్రాయెల్ లో లొకేషన్ లు కూడా చూసారు. కాని నిర్మాత వెనక్కు తగ్గడంతో సినిమా ఆగింది.
రాఘవా లారెన్స్ తో సినిమా
రాఘవా లారెన్స్ తో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాల్సి ఉంది. ఒక పోలీస్ స్టోరీ కూడా రెడీ చేసాడు గాని సినిమా కు పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ లేదు.
కోబలి
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాయలసీమ నేపధ్యంలో ఈ సినిమాను అప్పట్లో తీసుకురావాలని చూసారు. అన్నీ అనుకున్నారు గాని ఎందుకో వెనక్కు తగ్గారు.
వీవీ వినాయక్ తో సినిమా
వీవీ వినాయక్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సి ఉంది. కాని అనేక కారణాలతో ఆగిపోయింది.
దేశి
దేశి అనే ఒక సినిమాను కూడా పవన్ కళ్యాణ్ చేయాల్సి ఉన్నా సరే అనేక కారణాలతో ఆగిపోయింది.
ఎస్జే సూర్య తో సినిమా
కుషి సినిమా చేసిన ఎస్జే సూర్య తో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే ఎస్జ్జే సూర్య బిజీ గా ఉండటం సినిమా ఆగిపోయింది.
పోకిరి, ఈడియట్
పోకిరి ఈడియట్ లాంటి సినిమాలను పవన్ కళ్యాణ్ చేయాల్సి ఉంది గాని ఆగిపోయాయి.