90 ఏళ్ల వయసు వచ్చిందంటే ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. గతంలో 90 ఏళ్ల వయసు దాటిన సరే వృద్ధులు బయట తిరిగే వారు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి ఆ విధంగా కనబడటం లేదు. ఎన్నో అనారోగ్య సమస్యలతో 70 ఏళ్లకు మంచంలో పడే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడో ఒకరిద్దరు మినహా మనకు పెద్దగా వయసు మీరిన వాళ్ళు కనపడటం లేదు. చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు రావడంతో 60 ఏళ్ళు బ్రతకడం కూడా కొందరికి కష్టంగా మారింది.
అయితే కొంత మంది మాత్రం ఏళ్ళు పైబడుతున్న ఏమాత్రం కూడా వెనకడుగు వేయడం లేదు. తమ పొట్ట కూటి కోసం కొంతమంది కష్టపడుతుంటే తమ విలాసాల కోసం వయసు పైబడిన వాళ్ళు ఇప్పుడు ఏ మాత్రం కూడా వెనక్కు తగ్గకుండా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. శేష జీవితాన్ని తమ కోరికలు తీర్చుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.
తాజాగా మధ్యప్రదేశ్ లోని దేవాస్ జిల్లాకు చెందిన ఒక వృద్ధురాలు కారు నడపడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. 90 ఏళ్ల రేషన్ బాయ్ కార్ డ్రైవ్ చేయడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే వయసుతో సంబంధం లేదని ఈ బామ్మగారు నిరూపించారని ముఖ్యమంత్రి తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తనకు డ్రైవింగ్ అంటే ఇష్టం అని కారు తో పాటు ట్రాక్టర్లు కూడా నడుపుతా అని బామ్మ గారు చెప్పడం గమనార్హం.
दादी मां ने हम सभी को प्रेरणा दी है कि अपनी अभिरुचि पूरी करने में उम्र का कोई बंधन नहीं होता है।
उम्र चाहे कितनी भी हो, जीवन जीने का जज़्बा होना चाहिए! https://t.co/6mmKN2rAR2
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) September 23, 2021
Advertisements