‘ఆర్‌ఎక్స్100’ ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన ’90 ఎం.ఎల్` రిలీజ్ డేట్ ఫిక్సయింది. డిసెంబర్ 5న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఈ చిత్రంతో శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘ఆర్ ఎక్స్100’ తో సంచలన విజయం సృష్టించిన కార్తికేయ క్రియేటివ్ వర్క్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నేహా సోలంకి కథానాయిక. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ ని శ్రీ వైష్ణవి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఫ్యాన్సీ ఆఫర్‌కి సొంతం చేసుకుంది.
రీసెంట్ గా అజర్ బైజాన్ లో మూడు పాటల షూట్ కంప్లీట్ చేసుకుంది. ఈ షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ పూర్తయ్యింది.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. 90ఎం.ఎల్ అనే టైటిల్ కి తగ్గట్టుగానే సినిమా కూడా వైవిధ్యంగా ఉంటుందని, కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటూనే పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని దర్శక నిర్మాతలు చెపుతున్నారు. పోస్టర్స్, సాంగ్స్ క్లిక్ అవ్వడంతో 90 ఎం.ఎల్ మంచి బజ్ నే క్రియేట్ చేసింది. డిసెంబర్ 5న మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమతువున్నారు.