ఇండియాలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,216 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మరోవైపు ఇదే సమయంలో 391 మంది ఈ మహమ్మారి కారణంగా మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో 8612 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక తాజా గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 99,976 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,46,15,757
కోలుకున్నవారి సంఖ్య 3,40,45,666
మొత్తం మరణాల సంఖ్య 4,70,115
అలాగే గడిచిన 24 గంటల్లో కొత్తగా 73,67,230 మందికి వ్యాక్సిన్ వేయగా ఇప్పటి వరకు 1,25,75,05,514 మందికి వాక్సిన్ వేశారు.