దేశంలో కరోనా వైరస్ రోజువారి కేసుల్లో హెచ్చూ, తగ్గులూ కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,309 మంది కొత్తగా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక కరోనాకు చికిత్స పొందుతూ నిన్న 87 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించింది. తాజాగా ఈ మహమ్మారి బారి నుంచి 15,858 మంది కోలుకున్నట్టు ప్రకటించింది. ఇక కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా ఈ ఉదయం వరకు దేశవ్యాప్తంగా 75,05,010 మందికి టీకా వేసినట్టు వివరించింది.
దేశంలో మొత్తం కరోనా బాధితులు: 1,08,80,603
కోలుకున్నవారు: 1,05,89,230
కరోనా మరణాలు: 1,55,447
యాక్టివ్ కేసులు: 1,35,926