ఇటీవల కాలం లో సౌత్ ఇండియా సినిమాలు బాలీవుడ్ నాట రీమేక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా 96 ను బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, త్రిష హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. కాగా తాజాగా ఇప్పుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత అజయ్ కపూర్ హిందీలో నిర్మించనున్నారు.
ఈ విషయాన్ని అజయ్ కపూర్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు స్వయంగా ప్రకటించారు. త్వరలోనే దర్శకుడు, నటీనటుల వివరాలను విడుదల చేస్తామని తెలిపారు. ఇక ఈ సినిమాని తెలుగు లో దిల్ రాజు జాను అనే టైటిల్ తో రీమేక్ చేశారు. శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా నటించారు.