తెలంగాణలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. అంచనాలకు మంచిన వేగంతో విరుచుకుపడుతోంది. అటు పాజిటివ్ కేసులు, ఇటు మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 800 పైగా కేసులు నమోదు కావడం కలకలం రేపితే.. ఇవాళ ఏకంగా వెయ్యికి చేరువై ఆందోళన కలిగిస్తున్నాయి.గడిచిన 24 గంటల్లో 59 వేల మంది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఏకంగా..965 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా నిన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో నెలలుగా ఒకేరోజు ఈస్థాయిలో తెలంగాణలో ఎప్పుడూ కరోనా మరణాలు సంభవించలేదు. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 254 మందిలో పాజిటివ్ తేలింది.
తాజా కేసులతో తెలంగాణవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 3,09, 741కి చేరింది. ఇక మరణాలు 1706కు పెరిగాయి. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 3,01, 876కు చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 6,159 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు తెలంగాణలో కోటి 2 లక్షకుపైగా కరోనా టెస్టులు నిర్వహించినట్టు రాష్ట్రవైద్యారోగ్యశాఖ తెలిపింది.